Thursday, June 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home సైన్స్ అండ్ టెక్నాలజీ

రోదసి నుంచి రామసేతు ఎలా కనిపిస్తుందో తెలుసా….

Phaneendra by Phaneendra
Jun 24, 2024, 05:24 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారతదేశాన్ని శ్రీలంకను కలిపే రామసేతువు రోదసి నుంచి ఎలా కనిపిస్తుందో తెలుసా? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రోదసిలోకి పంపించిన కోపర్నికస్ సెంటినెల్ 2 అనే ఉపగ్రహం రామసేతును ఫొటో తీసింది.

రామాయణం ప్రకారం వానరులు పెద్దపెద్ద రాళ్ళతో ఆ వారధిని నిర్మించారన్న సంగతి తెలిసిందే. వాస్తవంలో కూడా అది పెద్ద సున్నపురాతి దిబ్బల వరుస అని, ఆ సమాహారం భారత్ నుంచి శ్రీలంక వరకూ ఉందనీ శాస్త్రవేత్తలు చెబుతారు. పాశ్చాత్య ప్రపంచం దాన్ని యాడమ్స్ బ్రిడ్జ్ అని పిలుస్తుంది.

రామసేతువు భారతదేశపు ఆగ్నేయభాగాన చిట్టచివర ఉన్న రామేశ్వరం ద్వీపాన్నీ, శ్రీలంకలోని మన్నార్ దీవినీ కలుపుతూ 48 కిలోమీటర్ల పొడవున ఉన్న వారధి. అది హిందూమహాసముద్రపు పాయ అయిన గల్ఫ్ ఆఫ్ మన్నార్‌ను, బంగాళాఖాతపు పాయ అయిన పాక్ జలసంధినీ వేరుచేస్తుంది.

రామసేతు మానవ నిర్మితమైన వారధి అని రామాయణం చెబుతుంది. కానీ, అది మనుష్యులు కట్టినది కాదని, ప్రకృతి సహజంగా ఏర్పడినది మాత్రమేననీ, దాన్ని కూల్చేసినంత మాత్రాన నష్టమేమీ లేదనీ మన్మోహన్ సింగ్ హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులోనే వాదించింది. భౌగోళిక శాస్త్ర ఆధారాల ప్రకారం సున్నపురాయి దిబ్బల వరుసగా ఉన్న ఈ సేతువు ఒకప్పుడు భారతదేశాన్నీ, శ్రీలంకనూ కలిపేది.

‘‘ఆ ప్రకృతి సహజమైన బ్రిడ్జి 15వ శతాబ్దం వరకూ సముద్రాన్ని దాటడానికి వీలుగా ఉండేది. ఆ తర్వాత క్రమంగా ఆ బ్రిడ్జి క్షీణించిపోయింది’’ అని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చెప్పింది.

రామసేతు దగ్గర సముద్రం పెద్ద ఎక్కువ లోతు ఉండదు. కేవలం పది మీటర్ల లోపే లోతుగా ఉంటుంది. అందువల్లే అక్కడ నీరు లేతరంగులో కనిపిస్తుంటుంది.

శ్రీలంకలోని మన్నార్ దీవి సుమారు 130 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఆ దీవినీ శ్రీలంకనూ కలుపుతూ ఒక రోడ్ బ్రిడ్జి, ఒక రైల్వే బ్రిడ్జి ఉన్నాయి. ఇక భారతదేశం వైపు చూస్తే రామేశ్వరం ద్వీపం ఉంది. దాన్నే పంబన్ దీవి అని కూడా అంటారు. పంబన్, రామేశ్వరం పట్టణాల మధ్య సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉంది. సముద్రాన్ని దాటి పంబన్ దీవి వరకూ వెళ్ళడానికి 2 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి కట్టారు.

భారత్, శ్రీలంక రెండువైపులా రామసేతువు పరిసరాలను పరిరక్షిత జాతీయవనాలుగా ఇరుదేశాలూ గుర్తించాయి. ‘‘రామసేతు దగ్గరున్న ఇసుకదిబ్బలు పలురకాల పక్షులు, చేపలు పెరిగే ఆవాసాలు. లోతు తక్కువగా ఉండే అక్కడి సముద్ర జలాలపై ఆ పక్షులు, చేపలు ఆధారపడి జీవిస్తుంటాయి. రామసేతు పరిసరాల్లో డాల్ఫిన్సు, డుగాంగ్‌లు, తాబేళ్ళూ ఇంకా ఎన్నో అరుదైన సముద్రజీవులు ఉన్నాయి’’ అని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది.

Tags: Adams BridgeCopernicus Sentinel 2European Space AgencyMannarRam SetuRameshwaramSatellite ImageSLIDERSrilankaTamil NaduTOP NEWS
ShareTweetSendShare

Related News

గాల్లోనే పేలిపోయిన మస్క్ మెగా రాకెట్
general

గాల్లోనే పేలిపోయిన మస్క్ మెగా రాకెట్

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం
general

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా
general

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
general

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

856 సార్లు పాము కాట్లు : వ్యాక్సిన్ తయారీకి ఓ వ్యక్తి త్యాగం
general

856 సార్లు పాము కాట్లు : వ్యాక్సిన్ తయారీకి ఓ వ్యక్తి త్యాగం

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.