భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు దూసుకెళుతోందనే అంచనాలు వెలువడుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ముందుగా అంచనా వేసిన దానికంటే ఎక్కువే సాధించే అవకాశముందని పిచ్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.2 శాతం వృద్ధి సాధిస్తుందని అంతర్జాతీయ ఆర్థిక అంచనాల సంస్థ పిచ్ తెలిపింది.
దేశంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం నెలకొనడం, ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో ఆర్థిక వృద్ధి అంచనాలు పెంచినట్లు పిచ్ తెలిపింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.5 నుంచి 6.2 మధ్య ఉండే అవకాశముందని పిచ్ ప్రకటించింది.