ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమంలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో ప్రధాని మోదీ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రమాణస్వీకార కార్యక్రమం తర్వాత ప్రధాని మోదీని పవన్ కళ్యాణ్, చిరంజీవి దగ్గరకు తీసుకెళ్ళి పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఇద్దరితో చేతులు కలిపిన ప్రధాని మోదీ, ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం చిరంజీవి, పవన్ తో నవ్వుతూ ముచ్చటించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీనిపై స్పందించిన చిరంజీవి, ప్రధాని మోదీ తమతో ఏం మాట్లాడారో తెలిపారు. తనతో, తన తమ్ముడు పవన్ తో ప్రధాని మోది మాట్లాడటంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత తన నివాసానికి పవన్ వచ్చి పాదాభివందనం చేసిన ఘటనను ప్రధాని మోదీ ప్రస్తావించారన్నారు. కుటుంబసభ్యులు, ప్రత్యేకించి అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమానుబంధాలు ఆ వీడియోలో కనిపించాయని మోదీ అన్నారని చిరంజీవి వెల్లడించారు.
భారత సంస్కృతిసంప్రదాయాల్ని, కుటుంబ విలువలు ప్రతిబింబించాయని అభినందించారని చిరంజీవి తెలిపారు. ప్రధాని తమతో అలా మాట్లాడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. తమ్ముడి స్వాగతోత్సవం లాగే మోదీతో జరిగిన సంభాషణ కూడా కలకాలం గుర్తుండిపోయే ఓ అపురూప జ్ఞాపకమని చిరు పేర్కొన్నారు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు