ప్రజలు తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయనని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో జరిగిన ఎన్డీయే సమావేశంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే అధినేతగా మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ, జనసేన, శివసేన (షిండే), జేడీఎస్, ఎన్సీపీ (అజిత్ పవార్) లోక్ జనశక్తి పార్టీల నేతలు ప్రధాని మోదీని ఏకగ్రీవంగా తమ అధినేతగా ఎన్నుకున్నారు. ఇవాళ సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలసి ఎన్డీయే నేతలు లిఖితపూర్వకంగా లేఖలు ఇవ్వనున్నారు.
ఈ నెల 9, సాయంత్రం ఆరుగంటలకు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. ఎన్డీయే పక్షాలకు కూడా వారి బలాలనుబట్టి మంత్రివర్గంలో ఛాన్స్ దొరకనుంది. మొత్తం 50 మంది వరకు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. కీలకమైన రక్షణ, హోం, రైల్వే, ఆర్థిక శాఖలు బీజేపీ నేతలకే దక్కే అవకాశముంది. టీడీపీ, జనసేనకు 4 మంత్రి పదవులు లభిస్తాయని ఆశిస్తున్నారు.
ఇవాళ ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశంలో కూటమి నేతలు ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కొనియాడారు. మోదీ నాయకత్వంలో పనిచేయడం తనకు ఆనందంగా ఉందన్నారు. జనసేన అధినేత పవన్, మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. మోదీ వేసిన అభివృద్ధి బాటలు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు.
ఎన్డీయే సమావేశంలో జేడీయూ అధినేత నితీశ్ కుమార్. శివసేన (షిండే)వర్గం నేత ఏక్నాథ్ షిండేతో సహా ఎన్డీయే నుంచి దాదాపు 292 మంది ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇవాళ సాయంత్రం కీలక నేతలు రాష్ట్రపతిని కలవనున్నారు.
గత ప్రభుత్వంపై ఉపముఖ్యమంత్రి డ్రగ్స్ వ్యాఖ్యల కలకలం