ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్నవూలో మహిళలు కాంగ్రెస్ కార్యాలయం ఎదుట బారులు తీరారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన గ్యారంటీ కార్డులు పట్టుకుని ఎదురుచూపులు చూస్తున్నారు. తమకు ఇస్తామని వాగ్దానం చేసిన డబ్బులు ఎప్పుడు ఇస్తారంటూ అడుగుతున్నారు.
రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారం చేసినప్పుడు, నెలకు రూ.8,500 లేదా సంవత్సరానికి లక్ష రూపాయల మొత్తం నేరుగా మహిళల ఖాతాల్లో పడిపోతుందని వాగ్దానం చేసారు. మహిళలందరినీ లక్షాధికారులను చేస్తామంటూ ఆయన మాట్లాడిన మాటల వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ ప్రచారం కారణంగానే కాంగ్రెస్-సమాజ్వాదీ పార్టీ కూటమి మొత్తం 80లో 43 నియోజకవర్గాల్లో విజయం సాధించింది.
ఎన్నికలూ పూర్తయ్యాయి, ఓట్ల లెక్కింపూ పూర్తయింది, కాంగ్రెస్-ఎస్పీ అభ్యర్ధుల విజయాల ఫలితాలూ వచ్చేసాయి. దాంతోపాటు లక్నోలోని మాల్మాల్ ఎవెన్యూలోని కాంగ్రెస్ కార్యాలయం ముందు పెద్దసంఖ్యలో మహిళలూ బారులు తీరారు. కాంగ్రెస్ అభ్యర్ధులు తమకిచ్చిన గ్యారంటీ కార్డులు పట్టుకుని మరీ వచ్చారు యూపీ మహిళలు. అవి చూపించి, ఈ నెల రావలసిన రూ.8500 ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.
‘ప్రచార సమయంలో జూన్ 5వ తేదీన మీ ఖాతాల్లోకి డబ్బులు పడిపోతాయంటూ చెప్పారు. కానీ మా ఖాతాల్లో ఒక్క పైసా కూడా పడలేదు. మా ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు పడతాయో అడగడానికే ఇక్కడికి వచ్చాం’ అని ఆ మహిళలు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని ప్రతినిధులెవరూ ఆ మహిళలకు సమాధానం చెప్పడం లేదు. దాంతో వారు ఆందోళన చెందుతున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ దేశంలోని పలు ప్రాంతాల్లో గ్యారంటీ కార్డులు పంచిపెట్టింది. అందులో జాతీయ జనగణన, యువతరానికి ఉద్యోగాలు, మహిళలకు ఏడాదికి లక్ష రూపాయల పంపిణీ వంటి హామీలు చాలా ఇచ్చింది. ఆ హామీల ఫలితంగానే ఉత్తరప్రదేశ్లో ప్రతిపక్ష కూటమి 43 స్థానాల్లో విజయం సాధించింది.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు