దేశంలోని 150 ప్రధాన జలాశయాల్లో నీటి మట్టం 23 శాతం పడిపోయినట్లు కేంద్ర జలసంఘం తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత నీటిమట్టం స్థాయి 77 శాతం తగ్గినట్లు పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లైవ్ స్టోరేజ్ మొత్తం 41.705 బిలియన్ క్యూబిక్ మీటర్లు. మొత్తం సామర్థ్యంలో ఇది 23 శాతం. గత ఏడాది ఇదే సమయంలో 53.832 బీసీఎం నీరు ఉంది.
150 ప్రధాన జలాశయాల్లో నీటి సామర్థ్యం 178.784 బీసీఎం గా ఉండగా దేశంలోని మొత్తం స్టోరేజ్ కెపాసిటీలో ఇది 69.35 శాతంగా ఉంది. 150 ప్రధాన జలాశయాల్లో పది హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ లో ఉన్నాయి.
గుజరాత్, మహారాష్ట్రలో 49 రిజర్వాయర్లు ఉండగా వాటి సామర్థ్యం 37.1 బీసీఎం. ప్రస్తుతం వాటిల్లో కేవలం 8.833 బీసీఎం మాత్రమే నీరు నిల్వ ఉంది.
యూపీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లో 26 రిజర్వాయర్లు ఉండగా వాటి కెపాసిటీ 48 బీసీఎంగా ఉండగా వాటిల్లో 14 బీసీఎం మాత్రమే నిల్వ ఉంది. ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడులో 42 జలాశయాలు ఉండగా, పూర్తి సామర్థ్యం 53 బీఎంసీ. ప్రస్తుతం ఈ రాష్ట్రాల్లో కేవలం 7.317 బీసీఎం అందుబాటులో ఉంది.
ఇండస్, బ్రహ్మపుత్ర, బ్రాహ్మణి, వైతరణి, నర్మద, తాపి, సబర్మతి బేసిన్ల వద్దే సాధారణం కన్నా ఎక్కువ నీరు నిల్వ ఉంది. కృష్ణా నదిలో స్టోరేజీ సాధారణం కంటే తక్కువగా ఉంది.
గత ప్రభుత్వంపై ఉపముఖ్యమంత్రి డ్రగ్స్ వ్యాఖ్యల కలకలం