ఏపీ ఈసెట్ లో 90.41 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో బాలురు 89. 35 శాతం కాగా, బాలికలు 93. 34 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. ఫలితాలను గురువారం ఉదయం అనంతపురం జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ) లో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కే. హేమచంద్రారెడ్డి, ఈసెట్ ఛైర్మన్ శ్రీనివాసరావు విడుదల చేశారు.
అభ్యర్థులు cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయడం ద్వారా ఫలితాలు పొందవచ్చు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి మే 8న రాష్ట్రవ్యాప్తంగా 14 పరీక్షా కేంద్రాలలో నిర్వహించారు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు