ఐఐటీలో సీటు సంపాదిస్తే, ఇక జాబ్ గ్యారంటీ అని విద్యార్థులు కలలు కంటూ ఉంటారు. అయితే తాజాగా సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగు చూసిన సమాచారం ఆందోళనకు గురి చేస్తోంది. దేశంలో 23 ఐఐటీల్లో చదివిన 8 వేల మందికి గత ఏడాది క్యాంపస్ ఉద్యోగాలు రాలేదని తేలింది. 2024 ఏప్రిల్‌తో ముగిసిన విద్యా సంవత్సరంలో 23 ఐఐటి క్యాంపస్‌లలోని 21500 మంది విద్యార్థులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 13410 మందికి మాత్రమే క్యాంపస్ ఉద్యోగాలు వచ్చాయని తేలింది.గడచిన రెండు సంవత్సరాలుగా ఈ క్యాంపస్ ఉద్యోగాలు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
కొన్ని ఐఐటీల్లో 22 శాతం మందికి ప్లేస్మెంట్ దక్కలేదు. మరికొన్నింటిలో ఇది 40 శాతంపైగా ఉంది. గడచిన రెండు సంవత్సరాల్లో ఢిల్లీ ఐఐటీలో 600 మందికి ప్లేస్మెంట్ దక్కలేదని సమాచార హక్కు చట్టం ద్వారా తేలింది. దేశంలో పేరెన్నికగన్న కాలేజీల్లో పీజీ చేసి ఇంజనీరింగ్ విద్యార్థుల్ల్ 61 శాతం మందికి క్యాంపస్ ఉద్యోగాలు దక్కలేదు.
క్యాంపస్ ప్లేస్మెంట్లు తగ్గడంతో ఐఐటియన్లలో ఆందోళన పెరిగిపోతోంది. గత ఏడాది ఆరుమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారనే సమాచారం నిరుద్యోగం వేగంగా పెరుగుతుందనే సంకేతాలిస్తోందని తెలుస్తోంది.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు