భారత
సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ స్సేస్ టూర్ కు బ్రేక్
పడింది. ఆమె ప్రయాణించాల్సిన బోయింగ్
స్టార్‌లైనర్ వ్యోమనౌకను
మోసుకెళ్లాల్సిన రాకెట్‌లో సాంకేతికత లోపం తలెత్తడంతో రోదసి ప్రయాణం వాయిదా
పడింది.
భారత
కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.04 గంటలకు రాకెట్
నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉండగా చివర్లో గుర్తించిన
లోపం కారణంగా మిషన్‌ను వాయిదా వేస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా
తెలిపింది.
ఫ్లోరిడాలోని
కేప్ కెనావెరాల్‌లో ఉన్న కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ నింగిలోకి
దూసుకెళ్లడానికి సిద్ధం కాగా కౌంట్ డౌన్ కు 90 నిమిషాల ముందు మిషన్‌ను
ఆపేస్తున్నట్లు నాసా వెల్లడించింది. రాకెట్‌లోని ఆక్సిజన్ రిలీఫ్ వాల్వ్
పనితీరు అసాధారణంగా ఉండటంతో సునీతా విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి
బుచ్ విల్‌మోర్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
స్టార్‌లైనర్‌తో
మానవసహిత యాత్ర నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ ప్రయోగం విజయవంతమైతే ఐఎస్‌ఎస్‌కు
వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వస్తుంది.
సునీత
2006, 2012లో రోదసిలోకి వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్
చేశారు. మునుపటి యాత్రలో భగవద్గీతను తనతో
తీసుకెళ్లిన సునీత, ఈ దఫా గణపతి విగ్రహాన్ని తీసుకెళతానని తెలిపారు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు