ఐక్యరాజ్య సమితి వేదికగా ఇజ్రాయెల్- పాలస్తీనా
వివాదంపై భారత్
మరోసారి తన వైఖరి స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా
కాంబోజ్ ఈ విషయంపై మరోసారి వివరణ ఇచ్చారు.
రెండు దేశాల సిద్ధాంతం పరమైన విధానమే వివాదాన్ని
పరిష్కరించగలదని,
అప్పుడే పాలస్తీనా ప్రజలు సురక్షితమైన
సరిహద్దులతో స్వేచ్ఛగా జీవించగల్గడంతో పాటు ఇజ్రాయెల్ భద్రతా సమస్యలు
పరిష్కారమవుతాయని అన్నారు. అదే సమయంలో
ఐక్యరాజ్యసమితి సభ్యత్వం కోసం
పాలస్తీనా చేస్తున్న డిమాండ్‌కు భారత్ మద్దతు తెలుపుతుందన్నారు.
1988లో భారతదేశం పాలస్తీనాను ప్రత్యేక దేశంగా
గుర్తించింది. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ప్రత్యక్షంగా, అర్థవంతమైన చర్చలు జరగాలని రుచిరా కాంబోజ్
ఆకాంక్షించారు. శాంతి చర్చలను పునఃప్రారంభించాలని ఇరు దేశాలకు భారత్ మరోసారి
సూచించింది.
పాలస్తీనా డిమాండ్‌ను గత నెలలో అమెరికా
వ్యతిరేకించింది.
1974లో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌ను గుర్తించిన
మొదటి అరబ్యేతర దేశం భారత కావడం గమనార్హం.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు