Our Prime Ministers : Pandit Jawaharlal Nehru – Part 1
******************************************************************
సత్యరామప్రసాద్ కల్లూరి రచన : మన
ప్రధానమంత్రులు
******************************************************************
పండిత జవహర్‌లాల్
నెహ్రూ (14-11-1889 : 27-05-1964) : 1
******************************************************************
భారతదేశానికి
1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినా, నిజానికి అప్పటికి మనకు వచ్చినది కేవలం ఒక
‘డొమినియన్ ప్రతిపత్తి’ మాత్రమే. అలా 1950 జనవరి 26 వరకూ కొనసాగాకనే మన రాజ్యాంగం
ఏర్పడగా, దానిని అనుసరించి ఈ దేశం సార్వభౌమ సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగా (Sovereign Democratic Republic) ఏర్పడింది.
1946లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా
ఎన్నికైన నెహ్రూ, 1947 నుంచి భారత ప్రధానిగా పదవీబాధ్యతను చేపట్టాడు. 1950లో మన
దేశం సార్వభౌమత్వాన్ని పొందింది. ఆ తర్వాత కూడా ప్రధాని పదవిలో నెహ్రూ తన మరణకాలం
వరకూ కొనసాగాడు. 1951-52, 1957, 1962 సాధారణ ఎన్నికలన్నింటిలోనూ ఆయన పార్టీయే
ఆధిక్యంతో గెలుపొందడం దానికి దోహదం చేసింది.
ఈమధ్యకాలంలో గాంధీ 1946లో తనకు
‘ఇష్టుడైన’ నెహ్రూనే కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించాడనీ (ఆ అధ్యక్షుడే భావి
ప్రధాని కాగలడు కాబట్టి), నిజానికి ఆ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో వివిధ
రాష్ట్రాల మండళ్ళ నుంచి వల్లభ్ భాయ్ పటేల్‌కే ఎక్కువ ఓట్లు వచ్చినా, గాంధీని
సంతుష్టుడిని చేయడం కోసం ఆయన ఆ పదవిని వదులుకున్నాడనీ కొన్ని వదంతులు వచ్చాయి.
వాటిని నేటి కాంగ్రెస్ నాయకులెవరూ సమర్థంగా తిప్పికొట్టలేకపోతున్నారంటే – ఆ
వదంతులు నిరాధారమైనవి అనుకోలేము కదా.
నెహ్రూ కాలంలో మూడుసార్లు లోక్‌సభ
ఎన్నికలు జరిగాయి. వాటిలో వివిధ పార్టీల బలాబలాలు పరిశీలిద్దాం.
సంపన్న కుటుంబంలో పుట్టి, ఇంగ్లండులో
ఉన్నతవిద్యను అభ్యసించిన కారణంగానో, మరే ఇతర కారణాల వల్లనో – నెహ్రూకు
భారతదేశంలోని ‘పల్లెటూళ్ళ పద్ధతులు’ అంతగా నచ్చుబాటుగా ఉండక, వాటి ప్రసక్తే ఆయనకు
ఇబ్బందికరంగా ఉండేదేమో అనిపించక మానదు. అంతేగాక, ఆయన మాటలవల్లగాని, వ్రాతలవల్లగానీ
ఆయన నాస్తికుడో, భగవంతుడి ఉనికి విషయమై ఒక నిశ్చితాభిప్రాయం లేనివాడో అనే విషయం
బోధపడేది కాదు.
‘‘నా విద్యాభ్యాసం రీత్యా నేను
ఆంగ్లేయుడను. దృక్పథం రీత్యా నేనొక అంతర్జాతీయుడను. సంస్కృతి రీత్యా ముస్లిమును.
యాదృచ్ఛికంగా మాత్రమే హిందువును’’ అనే వాక్యం నెహ్రూదే అనే వదంతి ఉన్నా, ఆ వాక్యం
నిజానికి ఆయన అన్నది కాదనే తెలుస్తోంది. అయితే వివిధ జాతీయ అంతర్జాతీయ సందర్భాలలో
ఆయన స్పందనలను గమనించినవారికి మాత్రం ఆ వాక్యం నెహ్రూ అనినదే కావచ్చుననీ, ‘ఒక
విభజిత దేశానికి’ ప్రధాని అనిపించుకోవడం కంటే తానొక ‘అంతర్జాతీయ పౌరుడిని’ అని
పిలిపించుకోవడానికే ఆయన ఎక్కువగా ఇష్టపడేవాడు అనిపించేదట.
ఏది ఏమైనా ఆయన ‘భారతీయ సంస్కృతి
సంప్రదాయాలపైన కొంత అయిష్టత, చులకనభావం ఉన్నవాడిగానో లేదా వాటిని అంతగా
పట్టించుకునేవాడు కాదేమో అన్నట్లుగానే ఆయన కనిపించేవాడట. ఒక విదేశీ అతిథి
కుటుంబానికి వినోదం కోసం ఆయన ఒక ‘పాములవాళ్ళ ఆట’ను ఏర్పాటు చేసాడనే వదంతి కూడా
లేకపోలేదు. అదే గనుక నిజమైతే ఇతరదేశాలవాళ్ళ దృష్టిలో మనదేశంలోని వాళ్ళలో
ఎక్కువమంది కేవలం ‘పల్లెటూరి బైతులే’ అనే అభిప్రాయం కలిగించబడిందనే అనుకోవాలి.
మరొకటి – మహమ్మద్ ఘజినీ పలుమార్లు
కూలగొట్టిన సోమనాథ దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమంలో అప్పటి ఉపప్రధానమంత్రి వల్లభ్‌భాయ్
పటేల్ చురుకుగా పాల్గొంటుండగా దానిని నెహ్రూ ఇష్టపడలేదు. ఆ ఆలయ పునర్నిర్మాణం
పూర్తయి, ప్రారంభోత్సవం జరిగినప్పుడు అప్పటి భారత రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్
ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడని తెలిసినప్పుడు ఆయన తన అసహనాన్ని దాచుకోలేకపోయాడు. మన
గుళ్ళూ గోపురాల పట్ల, ఇతర హిందూ కట్టడాల పట్ల ఆయనకు సదభిప్రాయం లేనందునే ఆయన ఆ
విధమైన అసహనాన్ని ప్రదర్శించి ఉండాలి. 1959లో ‘శిల్పకళ’పైన జరిగిన ఒక సదస్సులో ఆయన
తనకు హిందూ దేవాలయాలంటే ‘వికర్షణ’ కలుగుతుందనీ, తాజమహల్ వంటి సమాధులు మాత్రం తనకు
స్ఫూర్తి కలిగిస్తాయనీ అన్నాడు. అటువంటి మాటలు ఆ కాలపు యువతపైన, అభ్యుదయవాదులపైన
ఎలాంటి ప్రభావం కలిగించి ఉంటాయో ఊహించవచ్చు. అలాగే ఆ మాటలు ఆ రోజుల్లో ఆయననే
‘దైవం’గా భావించిన గ్రామీణులను, చదువుసంధ్యలు తక్కువగా ఉన్న సాధారణ ప్రజలను
ఏవిధంగా ప్రభావితం చేసాయో ఊహించడమూ కష్టం కాదు. మరోలా చెప్పాలంటే – ఆ కాలంలోని
ప్రజల మనస్సులలో మన సంప్రదాయాల పట్ల చులకనభావం ఏర్పడడానికి బీజాలు నాటబడ్డాయన్న
మాట. అది ‘ప్రత్యక్షంగానా, అప్రయత్నంగానా’ అనేది వేరే విషయం.
ఈమధ్యనే మన స్వాతంత్ర్య వజ్రోత్సవాలు
జరిగినప్పుడు బైటపడిన మరో ముచ్చట. లార్డ్ మౌంట్‌బాటన్ 1947లో ‘సెంగోల్’ అనే
రాజదండాన్ని లాంఛనప్రాయంగా ఇవ్వడం ద్వారా దేశాధికారాన్ని నెహ్రూకు బదలాయించాడట.
ఐతే ఆయనకు, ఆయన భజనపరులకు ఆ రాజదండం ‘అంతగా లెక్కచేయవలసిన వస్తువు’గా అనిపించని
కారణంగానో, మరేదైనా కారణంగానో ఆ సెంగోల్ అలహాబాద్‌లోని ఒక వస్తుప్రదర్శనశాలలో
చాలాకాలం ‘అనామకంగా పడిఉందనే’ వార్త వచ్చింది. ఆయనను నిశితంగా పరిశీలించిన
విద్యాధికులెందరో ఆయన ‘భారత్‌ను నిష్పాక్షిక దృష్టితో గమనించలేకపోయాడనీ,
భారతదేశంలోని సగటు పౌరుడి నాడిని సరిగా పట్టుకోలేకపోయాడనీ’ అన్నారు, ఇంకా అంటూనే
ఉన్నారు. ఆయన రచన ‘Discovery of
India’ పుస్తకానికి ఎంతో ప్రచారం జరిగింది. దాని
అమ్మకాలకు, ప్రాచుర్యానికి, ప్రభావానికీ ఆయనకు ఉన్న హోదా కూడా ఒక కారణం కావచ్చును.
ఆయన గురించి ఈవిధంగా చెప్పడమంటే ఆయన
మనదేశపు ఐక్యతకు, సార్వభౌమత్వానికీ అడ్డుపడినవాడని అనడానికి మాత్రం కాదు. అంతేకాక,
ఆయన మన మొదటి ప్రధానిగా మన దేశ ప్రగతికై తన 14 సంవత్సరాల పాలనా కాలంలో తనవంతుగా
నిర్విరామ కృషిని సల్పాడు.
(1) నెహ్రూ దేశభక్తి, నిజాయితీని
శంకించవలసిన పని లేదు. కొన్ని ప్రాంతాల నాయకుల, పార్టీల విచ్ఛిన్నపు పోకడలను ఆయన
చీదరించుకునేవాడు, అవసరాన్ని బట్టి గట్టిగా మందలించేవాడు కూడా. మన స్వాతంత్ర్య
పోరాటంలో ఆయన పాత్ర ఆదర్శప్రాయమైనది. అది నేటి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణంగా
వ్యతిరేకమనే విషయాన్ని గమనిస్తున్నాం కదా. ఈ రోజుల్లో ఆ పార్టీ మనుగడ నిలుపుకోవడం
కోసం ప్రమాదకర, విచ్ఛిన్నకర పార్టీలతో ప్రత్యక్షంగానే పొత్తులు పెట్టుకుని, అవి
ఏమి చేసినా గత్యంతరం లేక అంగీకరించే
పరిస్థితిలో ఉంది.
(2) ఆయన ప్రారంభించిన పంచవర్ష
ప్రణాళికలు మన దేశాన్ని పురోగమింపజేసాయి. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికి
ఉన్న ‘అతి దయనీయ పరిస్థితి’ నుండి ఈ పురోగతి మొదలైందనీ, అదికూడా విభిన్న భాషల,
ప్రాంతాల వైవిధ్యాన్ని అధిగమిస్తూ జరిగిందనీ గుర్తుంచుకోవాలి.
(3) వివిధ సమస్యలను అధిగమించడానికి
ఆయన హేతుబద్ధతనే (Pragmatic
Thinking) ఆశ్రయించాడు కానీ చాదస్తపు పద్ధతులను (Dogmatic
Thinking) కాదు.
(4) మన
దేశాన్ని వ్యావసాయిక దేశంగా గుర్తించిన కారణంగా, మొట్టమొదట ఆయన వ్యవసాయానికి
ప్రాముఖ్యం ఇచ్చాడు. హీరాకుడ్ డ్యామ్, భాక్రానంగల్ డ్యామ్, నాగార్జునసాగర్ డ్యామ్
వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక డ్యాములు ఆయన కృషి ఫలితమే, ఆయన దూరదృష్టికి సంకేతమే.
(5) అదే
ముందుచూపుతో ఆయన ఎక్కువ పెట్టుబడులు పెట్టించి ‘ఇనుము, ఉక్కు’ రంగంలో భారీ
పరిశ్రమలను, పెద్దపెద్ద ప్రభుత్వరంగ పరిశ్రమలను నెలకొల్పజేసాడు. అంతేగాక
ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలను ఏర్పరచడానికి కృషి చేసాడు.
అయితే ఆయన
నెలకొల్పిన, పాటించిన కొన్ని విధానాలు కాలక్రమేణా మనదేశానికి ఎన్నో ఇబ్బందులు
తెచ్చిపెట్టాయన్న మాట కూడా వాస్తవమే. వాటిలో కొన్నిటిని తెలుసుకుందాం.
(అ) చైనాతో
సంబంధాల విషయమై సంపూర్ణ వైఫల్యం:
సోవియట్
రష్యా పాటించిన ‘సోషలిజం’ అంటే నెహ్రూకు విపరీతమైన మోజని ఎందరికో తెలిసిన విషయమే. అందరికీ
సమాన హక్కులు లభించే సమసమ