శ్రీ శారద మఠం, రామకృష్ణ శారద మిషన్ అధ్యక్షురాలు పరివ్రాజిక ఆనందప్రాణ మాతాజీ(98) తుదిశ్వాస విడిచారు. కోల్ కతాలో మంగళవారం ఆమె కన్నుమూశారు. వృద్ధప్య సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న ఆమె శారదా మఠం ప్రధాన కార్యాలయంలో చికిత్స పొందుతున్నారు.
మాతాజీ మృతి పట్ల ప్రధాని మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. మాతాజీ సేవలను గుర్తు చేసుకున్నారు.
గత ఏడాది జనవరి 14న మాతాజీ శ్రీ శారద మఠం, రామకృష్ణ శారద మిషన్ అధ్యక్షురాలిగా మాతాజీ బాధ్యతలు చేపట్టారు.
1927లో జన్మించిన మాతాజీ చిన్న వయస్సు నుంచే ఆధ్యాత్మిక ఆలోచనలో గడిపేవారు. తర్వాతి కాలంలో రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ కార్యక్రమాల్లో తరుచుగా పాల్గొనేవారు. ఉత్తర కోల్‌కతాలోని నివేదిత హయ్యర్ సెకండరీ గర్ల్స్ స్కూల్లో టీచర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింన మాతాజీ, 2023లో శ్రీ శారద మఠం ఐదవ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె తన జీవితమంతా సామాజిక,మానవ సంక్షేమానికి అంకితం చేశారు.
గత ప్రభుత్వంపై ఉపముఖ్యమంత్రి డ్రగ్స్ వ్యాఖ్యల కలకలం