రాజస్థాన్లో
ఘోరం జరిగింది. వ్యాను, ట్రక్కును ఢీకొట్టిన ఘటనలో 9 మంది మృతి చెందారు. ఝలావర్
జిల్లాలో ఈ ఆదివారం ఉదయం ప్రమాద ఘటన చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్
లో వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఝలావర్ వద్ద వ్యాను ట్రక్కను ఢీకొట్టింది.
దీంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదంలో
గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఝలావర్ జిల్లా
ఎస్పీ రిచాతోమర్ తెలిపారు. మృతదేహాలకు అక్లెరా ఆస్పత్రిలో పోస్టుమార్టం
నిర్వహించనున్నారు.
ప్రమాద
ఘటన గురించి బాధితుల కుటుంబ సభ్యులకు తెలిపినట్లు ఆక్లేర పోలీస్ స్టేషన్ ఇంఛార్జి
సందీప్ బిష్ణోయ్ తెలిపారు. బాధితులంతా బాగ్రీ కమ్యూనిటీకి చెందిన వారని తెలిపారు.