Ichchapuram Assembly Constituency Profile
ఒడిషా సరిహద్దులో మొట్టమొదటి నియోజకవర్గం ఇచ్ఛాపురం. శ్రీకాకుళం జిల్లాలోని ఈ నియోజకవర్గం పరిధిలో
కంచిలి, ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పడింది.
1952, 1955లో మొదటి రెండు ఎన్నికల్లోనూ ఇచ్ఛాపురంలో కృషికార్ లోక్
పార్టీ విజయం సాధించింది. 1962లోనూ, 1972లోనూ కాంగ్రెస్ గెలిచింది. 1967లో జనతా
పార్టీ అభ్యర్ధి గెలుపొందారు. 1983 నుంచీ 2019 వరకూ తెలుగుదేశం హవా కొనసాగుతూనే
ఉంది. మధ్యలో 2004లో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ గెలిచింది.
2014,
2019 ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం అభ్యర్ధి బెందాళం అశోక్ 2024 శాసనసభ
ఎన్నికల్లోనూ ఇదే ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. హ్యాట్రిక్
సాధించాలని పట్టుదలగా ఉన్నారు. 2019లో జగన్ వేవ్‌లో సైతం వైఎస్ఆర్సిపి ఈ
స్థానాన్ని దక్కించుకోలేకపోయింది. ఆ పార్టీ ఇప్పుడు పిరియా విజయను బరిలోకి
దింపింది. 2019లో వైసీపీ అభ్యర్ధిగా నిలబడి ఓడిపోయిన పిరియా సాయిరాజ్ భార్యే విజయ.
ఈసారి ఎలాగైనా ఇచ్ఛాపురంలో తెలుగుదేశం కంచుకోటను బద్దలుకొట్టాలని అధికార పార్టీ
ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా మాసుపత్రి
చక్రవర్తి రెడ్డి పోటీ పడుతున్నారు.