Parvatipuram Assembly Constituency Profile
పార్వతీపురం నియోజకవర్గం మొదట్లో విజయనగరం
జిల్లాలో ఉండేది. ఇటీవల జిల్లాల విభజన జరిగిన తర్వాత పార్వతీపురం పేరుతోనే పార్వతీపురం
మన్యం జిల్లా ఏర్పడింది. అసెంబ్లీ నియోజకవర్గం మాత్రం 1951 నుంచీ ఉంది. షెడ్యూల్డు
కులాలకు రిజర్వ్ అయిన ఈ నియోజకవర్గం పరిధిలో పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట అనే
మూడు మండలాలు ఉన్నాయి.
1980లు, 90లలో పార్వతీపురం నియోజకవర్గంలో
తెలుగుదేశం పార్టీ హవా నడిచింది. 1999లో ఈ స్థానాన్ని కాంగ్రెస్ దక్కించుకోగలిగింది.
2004లోనూ, 2009లో కూడా కాంగ్రెస్ ఈ స్థానాన్ని నిలబెట్టుకుంది. రాష్ట్ర విభజన
తర్వాత ఆ పార్టీ పూర్తిగా నేలమట్టమైన నేపథ్యంలో 2014లో తెలుగుదేశం గెలిచింది.
2019లో జగన్ వేవ్‌లో వైఎస్ఆర్సిపి అభ్యర్ధి సుమారు 25వేల మెజారిటీతో విజయం
సాధించారు.
ఇప్పుడు పార్వతీపురంలో వైఎస్ఆర్సిపి
తరఫున సిట్టింగ్ ఎంఎల్ఎ అలజంగి జోగారావు మళ్ళీ బరిలోకి దిగారు. ఎన్‌డిఎ కూటమి
తరఫున తెలుగుదేశం అభ్యర్ధి బోనెల విజయ్‌చంద్ర పోటీ పడుతున్నారు. ఇండీ కూటమి తరఫున
కాంగ్రెస్ అభ్యర్ధి బత్తిన మోహనరావు పోటీ చేస్తున్నారు.