Supreme Court rejects to halt ASI survey at Bhojshala
Vagdevi Mandir
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా భోజ్‌శాలలో ఉన్న
సరస్వతీ దేవి ఆలయంలో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ)
శాస్త్రీయ సర్వే చేపట్టాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను
సుప్రీంకోర్టు సమర్థించింది. సర్వేకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను
విచారించిన సుప్రీంకోర్టు, ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. దేవాలయం ఆవరణలో శాస్త్రీయ
సర్వేకు అనుమతించింది.
హృషీకేశ్ రాయ్, ప్రశాంత్‌కుమార్ మిశ్రాలతో కూడిన
ద్విసభ్య ధర్మాసనం ఆ విషయంపై ఏఎస్ఐతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందనలు
తెలియజేయాలని కోరింది. అయితే సర్వేపై స్టే విధించడానికి నిరాకరించింది. అయితే,
అక్కడ వివాదాస్పదంగా ఎలాంటి తవ్వకాలూ చేపట్టరాదని స్పష్టం చేసింది.
మధ్యప్రదేశ్‌లోని భోజశాలలో వాగ్దేవి మందిర్
పేరుతో సరస్వతీ దేవికి ఒక ఆలయం ఉంది. దాన్ని ముస్లిములు కమాల్ మౌలా మసీదు అని
పిలుస్తూంటారు. ఆ ఆవరణను ‘వాగ్దేవి మందిర్-కమాల్ మౌలా మసీద్ కాంప్లెక్స్’ అని
వ్యవహరిస్తూంటారు. ఆ ప్రదేశాన్ని మంగళవారాలు గుడిగానూ, శుక్రవారాలు మసీదుగానూ,
మిగతా రోజుల్లో మామూలు దర్శనీయ స్థలంగానూ నిర్వహిస్తున్నారు. ఏఎస్ఐ నిర్వహణలో ఉన్న
ఆ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించాలంటే రూపాయి పెట్టి టికెట్ కొనుక్కోవాల్సిందే.
భోజశాలలో ఉన్న మా వాగ్దేవి మందిర్-కమాల్ మౌలా
మజీద్ కాంప్లెక్స్ అనే వివాదాస్పద స్థలంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని రాష్ట్ర
హైకోర్టు ఏఎస్ఐని ఆదేశించింది. దాన్ని వ్యతిరేకిస్తూ మౌలానా కమాలుద్దీన్ వెల్ఫేర్
సొసైటీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు
తీర్పునిచ్చింది. సర్వేను నిలువరించాల్సిన పని లేదని అభిప్రాయపడింది. దాంతో హైకోర్టు
ఆదేశాలను ఎఎస్ఐ అమలు చేయాల్సి ఉంటుంది.
హైకోర్టు తన ఉత్తర్వుల్లో ‘ఇక్కడ శాస్త్రీయ సర్వే
నిర్వహించడం ఎఎస్ఐ నిర్వర్తించవలసిన విధి. నిజానికి ఎఎస్ఐ ఆ పనిని ఎప్పుడో చేసి
ఉండాల్సింది’ అని స్పష్టంగా చెప్పింది. ‘ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఐదుగురు
సభ్యుల కమిటీతో ఆ ప్రదేశంలో అధ్యయనం, పరిశోధన లేదా శోధన చేపట్టవచ్చు. అయితే ఆ
మొత్తం ప్రదేశపు సహజ స్వరూప స్వభావాలను దెబ్బతీయకుండా, ధ్వంసం చేయకుండా సర్వే
నిర్వహించాలి. తద్వారా ఆ ప్రదేశపు నిజమైన స్వభావం, లక్షణం వెల్లడి అవాలి. నిజం
వెలుగు చూడదాలి’ అని హైకోర్టు ఆదేశించింది.
నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక తర్వాతనే ఆ
ప్రదేశంలో పూజా పునస్కారాలు చేసుకోడానికి అనుమతించాలా వద్దా అనే విషయాన్ని పరిగణనలోకి
తీసుకుంటామని హైకోర్టు తన ఉత్తర్వులో స్పష్టంచేసింది.
హైకోర్టు ఆదేశాల ప్రకారం
మార్చి 22న ఎఎస్ఐ అక్కడ సర్వే మొదలుపెట్టింది. ఆరు వారాల్లోగా సర్వే పూర్తి చేసి
నివేదిక ఇవ్వాలి. అయితే ముస్లిముల పక్షం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
సుప్రీంకోర్టు ఇవాళ ఆ పిటిషన్‌ను కొట్టివేయడంతో సర్వే మళ్ళీ మొదలుపెట్టడానికి
ఆటంకాలు తొలగిపోయినట్లే.
గత ప్రభుత్వంపై ఉపముఖ్యమంత్రి డ్రగ్స్ వ్యాఖ్యల కలకలం