ఆంధ్రప్రదేశ్
లో 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ డీఎస్సీ-2024 పరీక్షల షెడ్యూల్ లో మార్పులు
చేసినట్లు విద్యా శాఖ మంత్రి బొత్స
సత్యనారాయణ తెలిపారు.
గత
షెడ్యూల్ మేరకు ఈ నెల 15 నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, పలు కారణాల వల్ల ఈ పరీక్షలను మార్చి 30
నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తున్నామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మొత్తం 14
రోజుల పాటు రెండు సెషన్స్ లలో పరీక్షలను నిర్వహించేలా టైం టేబుల్ ను
రూపొందించామన్నారు.
సెకండరీ
గ్రేడ్ టీచర్ పోస్టులకు(ఎస్జీటీ) అర్హతలను మార్చడం, టెట్ పరీక్షకు డీఎస్సీ పరీక్షకు మధ్య తగిన సమయం ఇచ్చేందుకు షెడ్యూల్ లో మార్పులు అనివార్యమయ్యాయని ప్రకటనలో
వివరించారు.
సెంటర్ల ఎంపికకు మార్చి 20 నుంచి వెబ్ ఆప్షన్లు ద్వారా అవకాశం
కల్పిస్తున్నామన్నారు. హాల్ టిక్కెట్లను మార్చి 25 నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు అని స్పష్టం
చేశారు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు