బెంగళూరులోని
ఫేమస్ రామేశ్వరం కేఫ్ వద్ద ‘పేలుడు కేసు’ కీలక మలుపు తిరిగింది. సిలిండర్లు
కారణంగా పేలుడు జరగలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. బాంబు పేలుడనే అనుమానాలతో
జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)
రంగంలోకి దిగి విచారణ చేపట్టింది.
నేటి
మధ్యాహ్నం(శుక్రవారం) రామేశ్వరం కేఫ్‌లో భారీ విస్పోటనం జరిగింది. దీంతో
స్థానికులు పరుగులు తీశారు. ఘటనలో తొమ్మిది మంది గాయపడగా ఆస్పత్రికి తరలించి
చికిత్స అందజేస్తున్నారు.
కేఫ్‌లో
సిలిండర్ల కారణంగా పేలుడు జరగలేదని బాంబ్ స్క్వాడ్ విచారణలో తేలింది. ఓ చోట
ఎలక్ట్రిక్ వైర్లను గుర్తించారు. రామేశ్వరం కేఫ్ నిర్వాహకుడు నాగరాజ్‌తో తాను
మాట్లాడానని బీజేపీ నేత, ఎంపీ తేజస్వీ సూర్య ట్వీట్ చేశారు. కస్టమర్
ముసుగులో వచ్చిన ఓ వ్యక్తి బ్యాగ్ వదిలేసి వెళ్లాడని చెప్పాడని పేర్కొన్నారు. ఘటన
ముమ్మాటికే బాంబు పేలుడంటూ పోస్ట్ చేశారు.