టీఎంసీ
నేత షేక్ షాజహాన్‌ను పశ్చిమబెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. రేషన్ కుంభకోణం కేసు
విచారణలో భాగంగా సోదాలు నిర్వహించేందుకు వెళ్ళగా కొందరు దుండగులు అడ్డుకుని దాడికి
పాల్పడ్డారు.
ఈ
ఏడాది జనవరి5న ఈడీ అధికారులు సోదాలు నిర్వహించేందుకు సందేశ్‌ఖాలీ వెళ్ళగా కొందరు
అడ్డుకుని దాడి చేశారు. ఈ ఘటనలో షేక్ షాజహాన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారని దక్షిణ
బెంగా ఏడీజీ సుప్రీతిమ్ సర్కార్ తెలిపారు. సెక్షన్ 354 కింద అరెస్టు చేసి బసిర్హాట్
న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు వెల్లడించారు. అలాగే పోలీసు రిమాండ్‌కు ఇవ్వాలని
న్యాయమూర్తికి విన్నవించామన్నారు.
ఈడీ
అధికారులపై దాడి కేసుతో పాటు సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగికదాడి, భూకబ్జాలకు
పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ షాజహాన్ దాదాపు 55 రోజులుగా పరారీలో ఉన్నాడు.
కలకత్తా హైకోర్టు ఆదేశాలతో ఆయనను సందేశ్‌ఖాలీ కేసులో నిందితుడిగా చేర్చారు. హైకోర్టు
ఆదేశించిన మూడు రోజుల తర్వాత పోలీసులు షాజహాన్ ను అరెస్టు చేశారు. కేంద్ర, రాష్ట్ర
దర్యాప్తు బృందాలకు దొరకకుండా దాదాపు 55 రోజులుగా తప్పించుకు తిరుగుతున్నాడు.
ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మినాఖాన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో షాజహాన్‌ను గురువారం అరెస్టు
చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
గడిచిన
రెండేళ్ళలో షేక్ షాజహాన్ పై పలు కేసులు నమోదు అయ్యాయని తెలిపిన పోలీసు ఉన్నతాధికారులు,
దర్యాప్తు కొనసాగుతుందన్నారు.
రెండు,
మూడేళ్ళ కిందట జరిగిన ఘటనల్లో కూడా షాజహాన్ పై ఫిబ్రవరిలో చాలా కేసులు నమోదు
అయ్యాయని తెలిపిన పోలీసులు, వాటి దర్యాప్తు, సాక్ష్యాల సేకరణకు సమయం
పడుతుందన్నారు.
రాజకీయ లబ్ధికోసం షాజహాన్ కు టీఎంసీ నేతృత్వంలోని
మమతా బెనర్జీ మద్దతు పలుకుతోందని బీజేపీ ఆరోపించింది. ఇప్పటికైనా టీఎంసీ నైజాన్ని
ప్రజలకు గ్రహించాలని కోరింది.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు