మధ్య
ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరిగిన వేరు వేరు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు
కొల్పోయారు. మధ్యప్రదేశ్లో ట్రక్కు బోల్తా పడిన ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోగా,
జార్ఖండ్ లో ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో ఇద్దరు మరణించినట్లు తేలింది.
దిండోరి
జిల్లాలో ప్రయాణికులతో వెళుతున్న ట్రక్కు బోల్తా పడింది. దీంతో 14 మంది ప్రాణాలు
కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
క్షతగాత్రులను
రిని షాహ్పుర ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్లు కలెక్టర్ వికాస్ మిశ్రా తెలిపారు. ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం
చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4
లక్షల నష్టపరిహారం ప్రకటించారు.
జార్ఖండ్లో
జరిగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు.
పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. జాంతారలోని కాలా ఝరియా రైల్వేస్టేషన్ పరిధిలో
ఈ విషాద ఘటన జరిగింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కూడా
వార్తలొచ్చాయి. అయితే అధికారిక సమాచారం మేరకు ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఈఘటన పై రైల్వేశాఖ విచారణకు ఆదేశించింది. ప్రమాద ఘటనపై విచారణ కోసం ముగ్గురు
సభ్యులతో కమిటీ వేసింది.