తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ రైతులు చేస్తున్న చలో ఢిల్లీ (delhi chalo farmers protest) కార్యక్రమాన్ని విరమింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రైతు సంఘాల నాయకులతో కేంద్ర మంత్రులు చండీగఢ్‌లో సోమవారం జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండాతోపాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ రైతు సంఘాల నాయకులతో జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. పప్పుధాన్యాలు, పత్తి, మొక్కజొన్న పంటలకు కేంద్రం ఇవ్వజూపిన కనీస మద్దతు ధర హామీని రైతు సంఘాల నాయకులు తిరస్కరించారు.
కేంద్ర ప్రతిపాదనలు రైతులకు ప్రయోజనం చేకూర్చేవిగా లేవని రైతు సంఘాల నాయకులు ప్రకటించారు. కేంద్ర ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లు రైతు సంఘాల నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ప్రకటించారు.
ప్రధాన రైతు సంఘాల నాయకులతో కేంద్ర మంత్రులు నాలుగు గంటలకుపైగా చర్చలు జరిపారు. కేంద్ర ప్రతిపాదనలకు రైతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రైతు సంఘాల నాయకులు చెప్పారు. తరవాత వారు రైతులతో చర్చించి కేంద్ర ప్రతిపాదనలు ప్రయోజనకరంగా లేవని ప్రకటించారు.
చర్చలు విఫలం కావడంతో పంజాబ్, హర్యానా సరిహద్దు శంభు ప్రాంతంలో వారం రోజులుగా ఉన్న వేలాది రైతులు ఢిల్లీ వైపుగా కదులుతున్నారు. 21 తేదీ ఉదయం 11 గంటలకు వేలాది ట్రాక్టర్లతో ఢిల్లీకి చేరుకునేందుకు పయనమయ్యారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని లేదంటే బారికేడ్లు తొలగించి చలో ఢిల్లీకి సహకరించాలని
రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 23వ తేదీ చలో ఢిల్లీ మార్చ్ నిర్వహిస్తామని గ్రేటర్ నొయిడా రైతులు ప్రకటించారు. వారు భూసేకరణకు ఇచ్చే పరిహారంతోపాటు, అభివృద్ధి చేసిన ప్లాట్ల విషయంలో తమ డిమాండ్లు పరిష్కరించాలని వారు పిలుపునిచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీ అంతటా ఇప్పటికే 144 సెక్షన్ అమలవుతోంది. వేలాది మంది కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు. నేటి నుంచి మరలా రైతులు ఢిల్లీవైపుగా కదలడంత
భద్రత కట్టుదిట్టం చేశారు.