ఖలిస్తానీ
ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యను భారత్కు ఆపాదిస్తూ కెనడా ప్రధాని జస్టిన్
ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. భారతీయ
విద్యార్థులకు ఇచ్చే స్టడీ పర్మిట్ల సంఖ్యను కెనడా భారీగా తగ్గించింది.
గతేడాది
చివరి త్రైమాసికంలో భారతీయ విద్యార్థులకు కెనడా జారీ చేసిన స్టడీ పర్మిట్ల సంఖ్య అంతకు
ముందు వాటితో పోలిస్తే 86 శాతం తగ్గింది. గత ఏడాది డిసెంబర్ లో 14,910 మందికి
మాత్రమే అనుమతులిచ్చారు. అంతకు మునుపు 1,08,940 మందికి అనుమతించినట్లు కెనడా ఇమిగ్రేషన్
మంత్రి మార్క్ మిల్లర్ వెల్లడించారు.
కెనడా
ఇమిగ్రేషన్ లెక్కల ప్రకారం, 2022లో కెనడా జారీ చేసిన స్టడీ పర్మిట్లో భారతీయ
విద్యార్థుల వాటా ఏకంగా 41 శాతం కాగా, 2022లో ఏకంగా 2,25,835 మందికి పర్మిట్లు జారీ
చేశారు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు