టెస్లా ప్రోగ్రామింగ్ ఇంజనీర్‌పై రోబో దాడికి దిగింది. రోబో దాడిలో (robo attack) ఇంజనీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దిగ్గజ కార్ల తయారీ కంపెనీ టెస్లాకు చెందిన గిగా టెక్సాస్ ఫ్యాక్టరీలో రెండేళ్ల కిందటే ఈ ఘటన జరిగింది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టెస్లాలో అల్యూమినియం భాగాలను బిగించేందుకు రోబోను వాడుతున్నారు. పని అయిపోయిన తరవాత రోబోలను ఆఫ్ చేస్తుండగా, ఇంజనీర్‌పై రోబో దాడికి దిగింది. ఇంజనీర్ వీపు, చేతులపై దాడి చేసింది. ఇంజనీర్ తీవ్రంగా గాయపడ్డారు.
గత ఏడాది జులైలో కూడా టెస్లాలో రోబో దాడి చేసింది. గడచిన ఏడాది కాలంలో 21 సార్లు ఇలాంటి ఘటనలు జరిగాయని ఒకరు గాయపడినట్లు కంపెనీ తెలిపింది. ఇతర పరిశ్రమల్లో కూడా రోబోల దాడి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే టెస్లాలో ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఉద్యోగులకు సరైన శిక్షణ ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి దాడి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ దాడులపై స్పందించేందుకు టెస్లా నిరాకరించింది.