ఉద్యోగార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
మరో తీపికబురు చెప్పింది. ఒక్క రోజు వ్యవధి లోనే రెండు జాబ్ నోటిఫికేషన్లు జారీ
చేసింది. ఇప్పటికే గ్రూప్ -2 నోటిఫికేషన్
విడుదల చేసిన వైసీపీ ప్రభుత్వం, తాజాగా నేడు గ్రూప్ -1 ఉద్యోగాల భర్తీకి ప్రకటన
జారీ చేసింది.
81 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ
నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇందులో
డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 9, డీఎస్పీ
ఖాళీలు 26, జైళ్ళ శాఖ పరిధిలో ఒక డీఎస్పీ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు
ఏపీపీఎస్పీ ప్రకటనలో తెలిపింది.
స్టేట్ ట్యాక్స్ సర్వీసు పరిధిలో
అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు 18,
రవాణE శాఖ పరిధిలోని ప్రాంతీయ రవాణా అధికారి
పోస్టులు 6, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ అధికారి పోస్టు-1, జిల్లా సాంఘిక సంక్షేమ
అధికారి పోస్టులు -3, సహకారసంస్థల్లో డిప్యూటీ రిజిస్ట్రార్ ఖాళీలు-3, పురపాలక
శాఖలో కమిషనర్ పోస్టు ఒకటి, ఎక్సైజ్ శాఖ లో ఒక ఖాళీ కి నియామకాలు చేపడుతున్నారు.
అసిస్టెంట్ ఆడిటర్ పోస్టులు-2, జిల్లా
ఉపాధి అధికారి-4, ట్రెజరీ, అకౌంట్ సెక్షన్ లో 3 పోస్టులు
ఉన్నట్లు నోటిఫికేషన్ లో తెలిపారు.
మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష
ఉంటుందని తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 21 వరకు దరఖాస్తులు
స్వీకరించనున్నారు.
గ్రూప్-2
ఉద్యోగాలకు భర్తీ ఏపీపీఎస్సీ డిసెంబర్ 7న
ప్రకటన జారీ చేసింది. ఈ నెల 21 నుంచి జనవరి 10 వరకు ఆన్లైన్లో
దరఖాస్తులు స్వీకరించనున్నారు.
గ్రూప్–2 ప్రిలిమినరీ పరీక్షను
ఆబ్జెక్టివ్ తరహాలో ఫిబ్రవరి 25న నిర్వహించనున్నారు.
కమిషన్
ప్రకటించిన గ్రూప్–2
నోటిఫికేషన్లో 114 డిప్యూటీ తహసీల్దార్, 150 ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, గ్రేడ్–3 మున్సిపల్ కమిషనర్ల
పోస్టులు 4, గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్ 16, అసిస్టెంట్ లేబర్
ఆఫీసర్ 28
పోస్టులతో పాటు 59
శాఖల్లో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులున్నాయి.
నాన్
ఎగ్జిక్యూటివ్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ ఆడిటర్, ఆడిటర్ ఇన్ పే అండ్
అకౌంట్స్, పలు సెక్షన్లలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 566 ఉన్నాయి.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు