అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన బిల్లులకు మూడేళ్లుగా ఆమోదం తెలపకుండా ఏం చేస్తున్నారంటూ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని సుప్రీంకోర్టు (supreme court) ప్రశ్నించింది. ఉద్దేశపూర్వకంగా గవర్నర్లు, శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులను జాప్యం చేస్తున్నారంటూ తమిళనాడు, కేరళ, పంజాబ్ ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
మూడు రాష్ట్రాలు వేసిన పిటీషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. మూడేళ్లుగా బిల్లులకు ఆమోదం తెలపకుండా ఏం చేస్తున్నారంటూ తమిళనాడు గవర్నర్ను సర్వోన్నత న్యాయస్థానం నిలదీసింది. కేరళ గవర్నర్, ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ఆయన కార్యాలయానికి, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బిల్లుల ఆమోదంలో జాప్యానికి కారణాలు తెలపాలని నోటీసుల్లో ఆదేశించింది.