రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ ఎస్ వెంకటరమణన్ (92) కన్నుమూశారు. చెన్నైలోని ఆయన నివాసంలో శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. భార్య గిరిజా వైద్యనాథన్. గతంలో తమిళనాడు చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. పూర్వ తిరువాన్కూర్ స్టేట్లోని నాగర్కోయల్లో 1931లో జన్మించిన రమణన్.. 1990 నుంచి 1992 వరకూ ఆర్బీఐ గవర్నర్గా వ్యవహరించారు.
భారత్ తీవ్ర ఆర్థిక సవాళ్లు ఎదుర్కొన్న కాలంలో ఆయన గవర్నర్గా ఉన్నారు. అంతకు ముందు 1985 నుంచి 1989 వరకు భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు. దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న సమయంలో ఆయన ఆర్బీఐకి గవర్నర్గా వ్యవహరించారని, ఆయన కాలంలోనే సరళీకరణ ఆర్థిక విధానాలను భారత్ అవలంబించడం ప్రారంభించిందని ఆర్బీఐ తన వెబ్సైట్లో పేర్కొంది.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు