ఎన్నికల
ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్
షా పలు వాగ్దానాలు చేశారు. బీజేపీకి అధికారమిస్తే బీసీని సీఎం చేస్తామన్న ప్రధాని
హామీని పునరుద్ఘాటించారు. అలాగే ఐదేళ్ళ పాలనలో రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం
చేశారు.
బీజేపీని గెలిపిస్తే అయోధ్య రామమందిర ఉచిత దర్శనాన్నికూడా కల్పిస్తామని
హామీ ఇచ్చారు.
ఎంఐఎంకు
లొంగిపోయిన బీఆర్ఎస్, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని ఆరోపించారు. భారతీయ
జనతా పార్టీని ఆశీర్వదిస్తే సెప్టెంబర్ 17న అధికారికంగా విమోచన దినోత్సవాన్ని
జరుపుతామన్నారు. అలాగే ముస్లింల కోసం అమలు
చేస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్ కూడా రద్దు చేస్తామన్నారు.
గద్వాలలో
నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొన్న అమిత్ షా, అబద్ధపు మాటలతో
ప్రజల్ని కేసీఆర్ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ టైం అయిపోయిందని,
బీజేపీ సమయం ఆసన్నమైందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే తెలంగాణ వేగంగా
అభివృద్ధి చెందుతుందని ఓటర్లుకు అమిత్ షా వివరించారు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు