బైకుల విక్రయాల్లో రాయల్
ఎన్ ఫీల్డ్ కంపెనీ అమ్మకాల జోరును మరోసారి కొనసాగించింది. ఈ త్రైమాసికంలో రాయల్
ఎన్ ఫీల్డ్ సంస్థ 2,29,496
బైకులను విక్రయించి రికార్డు క్రియేట్ చేసింది.
గతేడాది త్రైమాసికంతో
పోల్చితే ఈ ఏడాది అమ్మకాలు 13
శాతం పెరిగాయి.
రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ ఆగస్టులో 77,583
బైకులు అమ్మగా, సెప్టెంబరులో 78,580
విక్రయించింది. క్లాసిక్ 350 బైకును ఆధునికీకరించి కొత్త వెర్షన్ ను విడుదల చేయడం కంపెనీకి బాగా
కలిసివచ్చింది. దీని తర్వాత స్థానంలో మెటియోర్ 350, హంటర్ బైకుల
అమ్మకాలు ఉన్నాయి.