హిమఖండం అంటార్కిటికాలో 1997 నుంచీ
కరిగిపోయిన మంచుఫలకాల్లో 40శాతానికి పైగా ఫలకాలు మళ్ళీ గడ్డకట్టే అవకాశాలు లేవని ఓ
అధ్యయనం తేల్చింది. పర్యావరణ కాలుష్యం, వాతావరణంలో మార్పుల కారణంగా చోటు
చేసుకుంటున్న దుష్పరిణామాల ప్రభావమే ఇదని శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేసారు.
ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్‌కు
చెందిన శాస్త్రవేత్తల బృందం
అంటార్కిటికాలో మంచు కరిగి, తరిగిపోతున్న తీరుతెన్నులపై అధ్యయనం చేసారు. 1997 నుంచి
2021 వరకూ పాతికేళ్ళ వ్యవధిలో అంటార్కిటికా పశ్చిమ భాగంలో 67 టన్నుల మంచు కరిగిపోయిందని వారి అధ్యయనంలో
తేలింది. అదే సమయంలో అంటార్కిటికా తూర్పు భాగంలో 59 టన్నుల మంచు పేరుకుందని కూడా
వారు గమనించారు. ఫలితంగా… ఆ పాతికేళ్ళ వ్యవధిలో కరిగిపోయిన మంచు నికరంగా 7.5
టన్నులు అని శాస్త్రవేత్తలు లెక్కించారు.
అంటార్కిటికా
పశ్చిమభాగంలో ఉండే ఉష్ణజలాల కారణంగానే అక్కడ మంచు కరిగిపోయిందని అధికారులు
నిర్ధారించారు. అయితే అంటార్కిటికా తూర్పు భాగంలో మంచు ఫలకాలు యథాతథ స్థితిలో
ఉండిపోవడమో, లేక అక్కడ సముద్ర జలాలు సాధారణ స్థితి కంటె ఎక్కువ చల్లబడడమో
జరిగిందని వారు భావిస్తున్నారు. హిమనీ నదాల అంచుల్లో ఉండే మంచు ఫలకాలు, మంచు వేగంగా
కరిగి సముద్రజలాల్లో కలిసిపోకుండా నిలువరిస్తాయి. ఆ ఫలకాలు కుంచించుకుపోయినప్పుడు
హిమనీ నదాలు సముద్రంలోకి భారీమొత్తంలో మంచినీటిని వదులుతాయి, అది దక్షిణ
మహాసముద్రంలోనిసాగరప్రవాహాలకు భంగం కలిగిస్తాయి.
ఈ అధ్యయన బృందానికి
నాయకుడు డాక్టర్ బెంజమిన్ డేవిసన్ ఇలా చెబుతున్నారు: ‘‘మంచు పలకల క్షీణతలో ఒక
మిశ్రమ పరిస్థితి ఉంది. దానికి కారణం అంటార్కిటికా చుట్టూ ఉన్న సముద్రంలోని
ఉష్ణోగ్రత, ఇంకా సముద్ర ప్రవాహాలు. అంటార్కిటికా పశ్చిమ భాగంలో ఈ మంచు పలకలు గోరువెచ్చని
నీటివల్ల ప్రభావితం అవుతుంటాయి. దానివల్ల మంచు పలకలు అడుగునుంచీ క్రమక్రమంగా
కరిగిపోతూ ఉంటాయి. అదే సమయంలో అంటార్కిటికా తూర్పుభాగంలోని ఎక్కువ ప్రాంతానికి ఆ
ముప్పు లేదు. తీరప్రాంతంలోని శీతలజలాలు ఈ ఉష్ణజలాల నుంచి మంచు పలకలను కాపాడతాయి.’’
అంటార్కిటికా
హిమఖండంలో ఏటికేటా చోటు చేసుకుంటున్న మార్పులను శాస్త్రవేత్తలు నమోదు
చేస్తున్నారు. సుదీర్ఘ ధ్రువరాత్రుల్లో సైతం దట్టమైన మబ్బులకు ఆవరించి ఉన్న
పరిస్థితుల్లో కూడా పనిచేయగల ఉపగ్రహాల ద్వారా ఈ మార్పులను గుర్తించి నమోదు
చేస్తున్నారు.
అలా, శాస్త్రవేత్తలు
మంచు పలకల ఆరోగ్యాన్ని విశ్లేషించడానికి అంతరిక్షం నుంచి తీసిన లక్షకు పైగా
చిత్రాలను అధ్యయనం చేసారు. ఆ ఫలితాలు మిగతా ప్రపంచానికి ప్రభావితం చేయగల ఆ
ఫలితాలను పలు వైజ్ఞానిక పత్రికల్లో ప్రచురించారు.
గత పాతికేళ్ళ
నుంచి మంచుపలకలు కరగడం వల్ల సుమారు 67 టన్నుల స్వచ్ఛమైన జలాలు సముద్రంలోకి విడుదల కావడం…
ప్రపంచమంతా ఉష్ణోగ్రతలను, పోషకాలను సరఫరా చేసే సముద్ర ప్రవాహాలపై ప్రభావం చూపింది.
ఇది సాధారణంగా ప్రకృతిసహజమైన
పరిణామమే అయితే మంచు మళ్ళీ పెరిగి ఉండేది, తద్వారా పర్యావరణంలో ఎలాంటి మార్పూ
ఉండేది కాదు. కానీ పర్యావరణ సంక్షోభం కారణంగా ఈ మంచు కరిగే ప్రక్రియ చోటు
చేసుకుంది. అందువల్ల అది సముద్ర తత్వంలోనూ, దానిపై ఆధారపడిన జీవజాలాల మనుగడపైనా తీవ్ర
ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
‘‘చాలావరకూ మంచుపలకలు
వేగంగా, కానీ తక్కువ కాలం పాటు కుంచించుకుపోతాయి, తర్వాత మెల్లమెల్లగా పెరుగుతాయి అని
మేం భావించాం. కానీ వాటిలో సగానికి పైగా మంచు పలకలు మళ్ళీ పెరిగే అవకాశం లేకుండా
కుంచించుకుపోతున్నాయని మా పరిశీలనలో తేలింది’’ అని డేవిసన్ స్పష్టం చేసారు.
గతనెల జరిగిన ఒక
అధ్యయనం, మిగతా ప్రపంచం కంటె అంటార్కిటికా రెండు రెట్లు ఎక్కువ వేడెక్కుతోందని
కనుగొంది. పర్యావరణ సంక్షోభ అధ్యయనాలు వేసిన అంచనాల కంటె ఇది చాలా ఎక్కువ. ఫ్రాన్స్‌కు
చెందిన శాస్త్రవేత్తలు అంటార్కిటికాలో వెయ్యేళ్ళ క్రితం ఉష్ణోగ్రతలు ఎలా ఉండేవో
తెలుసుకునేందుకు హిమఖండం నుంచి 78 మంచు నమూనాలను సేకరించి విశ్లేషించారు. ప్రకృతి
సహజమైన మార్పుల వల్ల కంటె, ఇతర కారణాల వల్లనే అంటార్కిటికాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా
పెరుగుతున్నాయని వారి అధ్యయనంలో తేలింది.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు