నేపాల్‌కు
చెందిన పర్వతారోహకుడు కమీ రిటా షెర్పా మరో కొత్త రికార్డు నెలకొల్పాడు. 8 వేల
మీటర్ల కంటే ఎత్తైన పర్వతాలను 42 సార్లు అధిరోహించిన
ఘనత సాధించారు. గతంలో ప్రముఖ పర్వతారోహకుడు నిమ్స్ పుర్జా 41 సార్లు అధిరోహించిన
రికార్డును అధిగమించాడు.
తూర్పు
నేపాల్ లోని సోలుఖుంబు జిల్లాకు చెందిన కమీ రిటాకు 53 ఏళ్ళు, 8,163 మీటర్ల ఎత్తైన మౌంట్
మనుస్లూను ఎక్కారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఇది కూడా ఒకటి.
సెవెన్ సమ్మిట్ ట్రెక్ సంస్థ చేపట్టిన 14 శిఖరాల
యాత్రలో భాగంగా మౌంట్ మనస్లూను అధిరోహించారు.
గత
ఏడాది ఎవరెస్ట్ శిఖరాన్ని 28వ సారి అధిరోహించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన కమీ
రిటా, సెవెన్ సమ్మిట్ ట్రెక్ ప్రైవేట్ లిమిటెడ్ కు గైడ్ గా పనిచేస్తున్నారు.
1994లో మొదటిసారి ఎవరెస్టును అధిరోహించారు.
కే2,
లాత్సేను ఒక్కోసారి, మనస్లూను నాలుగు సార్లు, చో ఓయూను ఎనిమిది సార్లు
అధిరోహించినట్లు సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ వెల్లడించింది.