తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్‌పై చర్యలు తీసుకోవాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు నోటీసులు జారీ చేసింది.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా దోమలతో పోల్చుతూ వాటిని నిర్మూలించాలని మంత్రి పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది. మంత్రి వ్యాఖ్యలపై ఇప్పటికే 262 మంది ప్రముఖులు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. వీరిలో మాజీ న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. మంత్రి ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలపై ఇప్పటికే ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో నాలుగు కేసులు నమోదయ్యాయి.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు