అనుమతులు
లేకుండా భారీ ర్యాలీ నిర్వహించిన క్రైస్తవులపై చర్యలు తీసుకోవడానికి బదులు,
ప్రశ్నించిన తమనే పోలీసులు తప్పుపట్టారని వీరవిల్లి గ్రామానికి చెందిన హిందువులు
వాపోతున్నారు.
పశ్చిమ
గోదావరి జిల్లా అత్తిలి మండలం వీరవిల్లికి ఈ నెల 13 న పెద్దసంఖ్యలో క్రైస్తవులు
తరలివచ్చారు. భారీ వాహనాల్లో గ్రామానికి చేరుకున్న క్రైస్తవులు బిగ్గరగా నినాదాలు
చేశారు. ఏసును నమ్ముకోకపోతే నరకానికి పోతారంటూ సందేశం ఇచ్చారు. క్రైస్తవ సందేశాలు,
నినాదాలపై గ్రామానికి చెందిన హిందువులు
అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ ప్రాంతానికి వచ్చి తమ సంప్రదాయాలు, నమ్మకాలను
కించపరిచేలా వ్యవహరించవద్దని కోరారు.
ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి
వివాదానికి దారి తీసింది. పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉండగా భారీ ర్యాలీలు ఎలా
నిర్వహిస్తారని హిందువులు ప్రశ్నించారు.
ఘటన
సద్దుమణిన అనంతరం 200 మంది క్రైస్తవులు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసుకుని ధర్నా
చేపట్టారు. తమను హిందువులు ఇబ్బందిపెట్టారంటూ నిరసన తెలిపారు. క్రైస్తవ శిబిరం
దగ్గరకు వెళ్ళి వివరణ అడుగుతున్న హిందువులను పోలీస్ స్టేషన్కు తరలించారు.
వీరవిల్లి
ఘటనపై విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, శివశక్తి సహా పలు హిందూ సంఘాలు మండిపడ్డాయి.
నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేయకుండా ప్రశ్నించిన వారిని ఎందుకు
ఇబ్బందిపెట్టారని పోలీసులను నిలదీశారు. అరెస్టు చేసిన హిందువులను వెంటనే విడుదల
చేయాలని కోరారు. హిందువులపై అన్యమతాల దాడులను ఐక్యంగా తిప్పికొట్టాలని వీరవిల్లి గ్రామ
ప్రజలను కోరారు.
హిందూ
సంఘాల ప్రతిఘటనతో పోలీసులు వెనక్కి తగ్గారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయడంతో
పాటు బలవంతపు మతప్రచారానికి పాల్పడుతున్న వారిపై చర్యలు చేపట్టారు.